దివ్య తేజోమయా యేసయ్యా Lyrics - Ps John Wesley | Ps Abraham | Ps Ramesh


దివ్య తేజోమయా యేసయ్యా
Singer Ps John Wesley | Ps Abraham | Ps Ramesh
Composer Hosanna ministries
Music kamalakar
Song WriterHosanna ministries

Lyrics-దివ్య తేజోమయా యేసయ్యా

దివ్య తేజోమయా యేసయ్యా 
నీతి నియమాలకు నిలయమా 
నిను నమ్ము నీజనుల – న్యాయాదిపతి నీవై 
నడిపితివి జయద్వజముతో 
నిత్యం నీకే నా ఆరాధన 
నీవే నీవే నా స్తుతికీర్తన
 1. బలవంతుడా మహశురుడా 
పలుశోధనలలో నాతోడై 
నా కుడి పార్శమందుండినావు 
నీ మహిమకై నీవేర్పరచిన 
నీ పాత్రగా నను మార్చినీవు
 నీ ఎనలేని ప్రేమను చూపితివి
 నీవే నీవే నా విజయం 
నాలో నీవే నీవే ఆనందం 
నీవే నీవే నా విజయం 
నాలో నీవే నీవే మహదానందం // నిత్యం // 
2. అభిషిక్తుడా నా ప్రాణేశ్వర 
నా నీడవలే నాతోనుండి 
నను రక్షించి పోషించినావు 
నేనెన్నడు నాకై ఆశించని
 నీ దీవెనలతో తృప్తిపరచి 
నన్నీస్థితిలో నీవు నిలిపినావు
 నీవే నీవే నాప్రాణం 
నాలో నినే నీవే నా ధ్యానం (2) // నిత్యం // 
3. 
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నా బాధలలో నేమ్మదినిచ్చి
గొప్ప ఆదరణ కలిగించె నాలో
మన్నైనది మన్నైపోనని
నన్న జీవాత్మతో నింపినీవు
నీ రూపుగానన్ను మార్చినానే
నిత్యం నీతో నడుపుటకు
నీవు నాలోనాతో ఉన్నవే (2) 
// నిత్యం //


దివ్య తేజోమయా యేసయ్యా Watch Video

1 Comments

Post a Comment