అధికముగా చేయగలడు యేసయ్యా Lyrics - SHALEMU RAJU


అధికముగా చేయగలడు యేసయ్యా
Singer SHALEMU RAJU
Composer SHALEMU RAJU
Music THANDRI SANNIDHI MINISTRIES
Song WriterSHALEMU RAJU

Lyrics-అడిగే వాటికంటే ఊహించే వాటికంటే



  అడిగే వాటికంటే ఊహించే వాటికంటే
 అధికముగా చేయగలవు యేసయ్యా 
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా "2" 
            (నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా ) "అడిగే
 1.చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా 
         నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా "2" 
         అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన "2" 
                   పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన "2" "అధికముగా
     2.అల్పమైన వాటిని ఆశించును నా హృదయం 
               అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం "2" 
       ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం "2" 
                    ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం "2" "అధికముగా "


అధికముగా చేయగలడు యేసయ్యా Watch Video

1 Comments

Post a Comment