పుడమంతా పులకించె ఉల్లాసంగా Lyrics - Dr. A.R.Stevenson


పుడమంతా పులకించె ఉల్లాసంగా
Singer Dr. A.R.Stevenson
Composer Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song WriterDr. A.R.Stevenson

Lyrics-పుడమంతా పులకించె ఉల్లాసంగా

పుడమంతా పులకించె ఉల్లాసంగా
 మనసున్న మహరాజు జన్మించంగ 
దివ్యరూపి యేసు మేను ధరియించంగ 
వేడుకలు జరగాలి ఉత్సాహంగా 
 సంతోషిద్దాం సందడి చేద్దాం రాజును పూజించి తరిద్దాం

1. లోకాన్ని ప్రేమించి ప్రాణప్రదంగా 
పుత్రుణ్ణి పంపించె తండ్రి స్వయంగా 
ప్రాణాన్ని పెట్టి లేవంగ 
రక్షకుడే దీనుడుగా రాగా పండుగ
 2. పరలోక సైన్యాలు కూడి ఘనంగా
 స్వరమెత్తి స్తోత్రాలు పాడె ప్రియంగా 
సంతోష వార్త చాటంగ 
గొల్లలకు దర్శనము కాగా పండుగ 
3. ఆకాశ వీధుల్లో కొత్తదనంగా 
తారొకటి వెలిగింది కాంతిమయంగా 
జ్ఞానులకు దారి చూపంగ 
బాలునికి కానుకలు తేగా పండుగ


పుడమంతా పులకించె ఉల్లాసంగా Watch Video

Post a Comment