నీ సన్నిధిలో సంపూర్ణమైన Lyrics - A R Stevenson I Ahalya


నీ సన్నిధిలో సంపూర్ణమైన
Singer A R Stevenson I Ahalya
Composer Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song WriterDr. A.R.Stevenson

Lyrics-నీ సన్నిధిలో సంపూర్ణమైన 

నీ సన్నిధిలో సంపూర్ణమైన 
సంతోషము కలదయా యేసయ్యా 
సంతోషము కలదయా 
నిను విడిచి ఎట్లుండగలనయా 
నీవు లేకుంటే ఏమైపోదునయా 
1. బలహీన సమయాన నీ శక్తితో 
కార్యాన్ని జరిగించుచున్నావయా 
భయపడ్డ నన్ను పలకరించుచు 
బ్రతికించుచున్నావయా యేసయ్యా 
నీవు నాకుంటే చాలయా 
2. అనుమానస్థితిలోన నీ మాటతో 
సంతృప్తి కలిగించుచున్నావయా 
తడబడ్డ నాకు సహకరించుచు 
గెలిపించుచున్నావయా యేసయ్యా
 నీవు నాకుంటే చాలయా 
3. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో 
విశ్రాంతి నెలకొల్పుచున్నావయా 
శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు 
వెలిగించుచున్నావయా యేసయ్యా 
నీవు నాకుంటే చాలయా


నీ సన్నిధిలో సంపూర్ణమైన Watch Video

Post a Comment