అందాల తార Lyrics - Bro. Nissi John, Sis. Erusha Queen, Sis. Evangeline Paul & Evg. Joel N Bob


అందాల తార
Singer Bro. Nissi John, Sis. Erusha Queen, Sis. Evangeline Paul & Evg. Joel N Bob
Composer Yesupadam
Music Ps. Isaac Pilli
Song Writer Maasilaamani

Lyrics

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో 
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్
 ఆనందసంద్ర ముప్పోంగె నాలో… అమరకాంతిలో 
ఆది దేవుని జూడ… అశింపమనసు పయనమైతిమి 
అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో 
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్ 
2. విశ్వాసయాత్ర దూరమెంతైన… విందుగా దోచెను 
వింతైన శాంతి వర్షించే నాలో… విజయపథమున
 విశ్వాలనేలెడి దేవకుమారుని… వీక్షించు దీక్షలో 
విరజిమ్మె బలము, ప్రవహించె ప్రేమ… విశ్రాంతి నొసగుచున్
 అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
 అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్ 
3. యెరూషలేము రాజనగరిలో… ఏసుని వెదకుచు 
ఎరిగిన దారి, తొలగిన వేల… ఎదలో కృంగితి 
ఏసయ్య తార ఎప్పటివోలె… ఎదురాయె త్రోవలో 
ఎంతో యబ్బురపడుచు, విస్మయమొందుచు… ఏగితి స్వామి కడకు
 అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
 అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్
 4. ప్రభు జన్మస్ధలము… పాకయే గాని పరలోక సౌధమే 
బాలునిజూడ జీవితమెంత… పావనమాయెను 
ప్రభు పాదపూజ దీవెనకాగా… ప్రసరించె పుణ్యము 
బ్రతుకె మందిరమాయె, అర్పణలే సిరులాయె… ఫలియించె ప్రార్ధన
 అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో 
యేసయ్య కీర్తి… అవని చాటుచున్


అందాల తార Watch Video

Post a Comment