స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు Lyrics - Daniel Praneeth | Giftson Durai


స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు
Singer Daniel Praneeth | Giftson Durai
Composer Daniel Praneeth
Music Giftson Durai
Song WriterDaniel Praneeth

Lyrics

స్థిరపరచువాడవు బలపరచువాడవు 
పడిపోయిన చోటే నిలబట్టువాడవు 
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
 మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు 

     ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
 నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు
 యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము
 
1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి 
నీ చేతిలోనే మా జీవమున్నది 
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి 
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి
 
2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? 
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? 
మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును 
అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును


స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు Watch Video


Post a Comment