నాలో ఏమంచి లేకపోయినా Song Lyrics - Bro. K Barnaba


నాలో ఏమంచి లేకపోయినా
Singer Bro. K Barnaba
Composer Symonpeter Chevuri
Music Symonpeter Chevuri
Song WriterSis. Krosuri Srujana

Lyrics- పల్లవి 

నాలో ఏమంచి లేకపోయినా 

నీ ప్రేమను చూపి నన్ను రక్షించినావు
 నశించుపోవుచున్న నా జీవితములో 
మంచి సమరయునివై నన్ను రక్షించినావు 
నా జీవితములో నీవు చేసిన మేలులను 
వర్ణించలేను నా యేసయ్యా 
నా జీవితములో నీవు చేసిన మేలులను 
వివరించలేను నా యేసయ్యా
 యేసయ్య యేసయ్య నీ ప్రేమ మధురము 
యేసయ్య యేసయ్య మధురాతి మధురము
 1. పాపములో లోకములో తిరుగుచున్న నన్ను
 అపవాది కోరలలో చిక్కుకున్న నన్ను 
నీ ఉన్నత ప్రేమ చూపి రక్షించినావు 
విలువైన నీ కృపను నాపై చూపినావు
 2. బంధువులు స్నేహితులు ఎందరో ఉన్నను 
నీలా ఆదరించే ప్రేమలేకపోయెను
  నా నేనున్నానంటూ నను ధైర్యపరచినావు 
కృంగిన ప్రతిక్షణము నా తోడై ఉన్నావు 
3. నాకంటే జ్ఞానులు ఎందరో ఉన్నను 
ఎన్నికేలేని నన్ను ఎన్నుకున్నావు 
విలువలేని నాకు విలువనిచ్చినావు 
నా ప్రాణమున్నంత వరకు నీకై జీవించేదా


నాలో ఏమంచి లేకపోయినా Watch Video

Post a Comment